BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

బోడుప్పల్‌లో 22A వివాదం.. 1,500 కుటుంబాల ఆందోళన

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

# బోడుప్పల్‌లో 22A వివాదం.. 1,500 కుటుంబాల ఆందోళనబోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన పలువురు స్థానికులు 22A నిషేధిత జాబితా సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సుమారు 1,500 కుటుంబాల ఇళ్లను అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి తీసుకురావడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తుండటంతో, అవసరమైన సమయంలో ఆస్తులను విక్రయించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఈ పరిణామం తమను ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు.. ప్రజల ఆస్తులపై ఏర్పడిన 22A సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అర్హత ఉన్న ఆస్తులను జాబితా నుంచి తొలగించాలని కోరారు.దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలకు స్పష్టత కల్పించడంతో పాటు, వారి ఆస్తి హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే బాధితుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News