**రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి**హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఐటీ ఉద్యోగి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబ్బాస్ (25), అభిరుఫ్, సహస్ర చటోపాధ్యాయ ముగ్గురు బైక్‌పై ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. స్టాఫ్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.అభిరుఫ్ తీవ్రంగా గాయపడటంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వ్యక్తి సహస్ర చటోపాధ్యాయకు కూడా గాయాలయ్యాయి. అయితే అతడు హెల్మెట్ ధరించి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి



















