BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

**రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి**హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఐటీ ఉద్యోగి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబ్బాస్ (25), అభిరుఫ్, సహస్ర చటోపాధ్యాయ ముగ్గురు బైక్‌పై ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. స్టాఫ్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.అభిరుఫ్ తీవ్రంగా గాయపడటంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వ్యక్తి సహస్ర చటోపాధ్యాయకు కూడా గాయాలయ్యాయి. అయితే అతడు హెల్మెట్ ధరించి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News