కాకినాడలో సంచలనం.. ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్ అరెస్ట్కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న సాధిక్‌ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కాకినాడలో తీవ్ర చర్చకు దారితీసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా సాధిక్‌ఖాన్ పేరు తెరపైకి రావడంతో అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.సాధిక్‌పై ఇప్పటికే సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై ఉన్నట్లు సమాచారం. అలాగే రాజమండ్రి టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ అతడిపై మరో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా జగదీష్‌రెడ్డి హత్య కేసులోనూ సాధిక్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.యూపీలో పట్టుబడిన సాధిక్‌ను కాకినాడకు తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. అతడి విచారణ అనంతరం ఏఈ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
కాకినాడలో సంచలనం.. ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్ అరెస్ట్
బోడుప్పల్లో మైనింగ్ ఏడీ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ సంచలన ఆరోపణలు.. రూ.18.09 కోట్ల లావాదేవీలపై ఆధారాలు
అలయర్లో రూ.14 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పాలన అధికారి ఏసీబీకి చిక్కారు
విద్యార్థులారా జాగ్రత్త.. ముఖ్యంగా ఆడపిల్లలు సోషల్ మీడియా మాయలో పడొద్దు!



















