ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీ జయరాజు నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో కొనసాగుతున్నట్లు సమాచారం.హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. జయరాజుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు పుస్తకాలు గుర్తించినట్లు సమాచారం. అలాగే జనగామ జిల్లాలోని 5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.అయితే సోదాలు ఇంకా పూర్తికాలేదు. దీంతో జయరాజుకు సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ ఎంత? మరిన్ని నగదు, బంగారం లేదా కీలక పత్రాలు లభించాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. తనిఖీలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
బోడుప్పల్లో మైనింగ్ ఏడీ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ సంచలన ఆరోపణలు.. రూ.18.09 కోట్ల లావాదేవీలపై ఆధారాలు
అలయర్లో రూ.14 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పాలన అధికారి ఏసీబీకి చిక్కారు
విద్యార్థులారా జాగ్రత్త.. ముఖ్యంగా ఆడపిల్లలు సోషల్ మీడియా మాయలో పడొద్దు!
కాకినాడలో సంచలనం.. ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్ అరెస్ట్



















