భోటే కోషి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో నేపాల్‌లోని పలు జిల్లాలకు వరద ముప్పు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.నదీతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించారు. సహాయక, రక్షణ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు.



















