రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనంఉత్తరాంధ్ర, రాయలసీమలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలురానున్న 2 రోజులు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలుజూన్ 1 నుంచి ఆగస్ట్ 26 వరకు దేశంలో లోటు వర్షపాతం🌧️ ఏపీకి వర్ష సూచన.. రేపు మరో అల్పపీడనంబంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆగస్టు 29న వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వద్ద ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమకు ఆగస్టు 28 నుంచి 31 వరకు ఉరుములు, పిడుగులు, బలమైన ఉపరితల గాలులపై IMD హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ ఈ సీజన్‌లో ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో తాజా వాతావరణ వ్యవస్థపై రైతులు, ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం లోటు కొనసాగుతోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు నమోదైన వర్షపాతంపై తాజా గణాంకాలను బట్టి దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యాయి.
ఏపీకి వర్ష సూచన.. రేపు మరో అల్పపీడనం



















