BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

22A భూముల వివాదంపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లతో కొనసాగుతున్న ఆస్తులను అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ పేరుతో నివాస ప్రాంతాలను 22A జాబితాలో చేర్చడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. ప్రజల ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి, వాటి పరిష్కారం పేరుతో కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.22A పేరుతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని బినామీల ద్వారా సెటిల్మెంట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలు తమ ఆస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితుల తరఫున బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని హామీ ఇచ్చారు.ప్రభుత్వం వెంటనే సమస్యను పరిశీలించి, చట్టబద్ధమైన ఇళ్లను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రజల ఆస్తులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిం# 22A భూముల వివాదంపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలుబోడుప్పల్‌ పరిధిలోని పలు కాలనీల ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లతో కొనసాగుతున్న ఆస్తులను అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ పేరుతో నివాస ప్రాంతాలను 22A జాబితాలో చేర్చడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. ప్రజల ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి, వాటి పరిష్కారం పేరుతో కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.22A పేరుతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని బినామీల ద్వారా సెటిల్మెంట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలు తమ ఆస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితుల తరఫున బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని హామీ ఇచ్చారు.ప్రభుత్వం వెంటనే సమస్యను పరిశీలించి, చట్టబద్ధమైన ఇళ్లను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రజల ఆస్తులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News