SIRపై ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖక్లెయిమ్స్, అభ్యంతరాల గడువును పొడిగించాలని వినతిసెప్టెంబర్ 16 వరకు ఉన్న గడువును..మరికొన్ని వారాలు పొడిగించాలని కోరిన సీఎం రేవంత్తుది ఓటర్ల జాబితా గడువునూ పొడిగించాలని విజ్ఞప్తి73.39 లక్షల ఎంట్రీలు ASDD కేటగిరీలో ఉన్నాయితాత్కాలికంగా వెళ్లిన వారిని కూడా..శాశ్వతంగా తరలివెళ్లినట్టు పరిగణించే అవకాశం ఉందిఓటర్లకు కొత్త చిరునామాలో నమోదుకు సాయం అందించాలినోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు సమయంఇవ్వాలని సూచనజాబితా నుంచి అర్హులు తొలగిపోకుండా చూడాలని వినతిERO స్థాయిలో సిబ్బందిని మరింత పెంచాలని కోరిన సీఎంఈసీకి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీSIRపై ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖహైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును మరికొన్ని వారాలు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం సెప్టెంబర్ 16 వరకు ఉన్న గడువును పొడిగించడంతో పాటు తుది ఓటర్ల జాబితా విడుదల గడువును కూడా పెంచాలని సీఎం కోరారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఎంట్రీలు ASDD కేటగిరీలో ఉన్నాయని, వీరిలో తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని శాశ్వతంగా తరలిపోయినవారిగా పరిగణించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తాత్కాలికంగా వలస వెళ్లిన ఓటర్లకు కొత్త చిరునామాలో నమోదు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. అలాగే ఎన్నికల నోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు తగినంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ERO స్థాయిలో సిబ్బందిని మరింత పెంచాలని, ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి ఈసీకి హామీ ఇచ్చారు.
SIRపై ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ.



















