జనసేనాని జన్మదినం రోజున జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటనసెప్టెంబర్ 2, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటించి, విధివిధానాలను తెలియజేయనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.జనసేనాని జన్మదినం రోజున యువజన విభాగం ప్రకటనసెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా యువజన విభాగానికి సంబంధించిన విధివిధానాలు, బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.పార్టీలో యువతను మరింత చురుకుగా భాగస్వాములను చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ప్రజా సమస్యలపై యువతను కార్యాచరణలోకి తీసుకురావడం వంటి అంశాలకు యువజన విభాగం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు పలు కార్యక్రమాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో యువజన విభాగం ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
జనసేనాని జన్మదినం రోజున యువజన విభాగం ప్రకటన.



















