వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.తెలుగు భాష గొప్పతనాన్ని కాపాడుతూ, భావితరాలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తెలుగు భాష వెలుగులు ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలి.తెలుగు వెలుగు చిరకాలం వర్ధిల్లాలి.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు



















