భారత్‌పై మరోసారి అమెరికాకు చెందిన USCIRF (United States Commission on International Religious Freedom) విమర్శలు గుప్పించింది. మత స్వేచ్ఛ పేరుతో భారతదేశంపై ఆరోపణలు చేస్తూ, దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటన నేపథ్యంలో USCIRF ఆయన వీసాను రద్దు చేయాలని, ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.అయితే USCIRF ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. సంస్థ వ్యవహారశైలి పక్షపాతంతో కూడుకున్నదని, భారతదేశ వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నివేదికలు రూపొందిస్తోందని భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.మత స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు చేయడం, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలతో USCIRF వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది.
భారత్‌పై USCIRF మరోసారి విషప్రచారం.. పక్షపాత వైఖరి బట్టబయలు.



















