నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లతో కొనసాగుతున్న ఆస్తులను అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.అర్బన్ ల్యాండ్ సీలింగ్ పేరుతో నివాస ప్రాంతాలను 22A జాబితాలో చేర్చడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. ప్రజల ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి, వాటి పరిష్కారం పేరుతో కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.22A పేరుతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని బినామీల ద్వారా సెటిల్మెంట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలు తమ ఆస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు.ప్రభుత్వం వెంటనే సమస్యను పరిశీలించి, చట్టబద్ధమైన ఇళ్లను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిం# 22A భూముల వివాదంపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలుబోడుప్పల్ పరిధిలోని పలు కాలనీల ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లతో కొనసాగుతున్న ఆస్తులను అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.అర్బన్ ల్యాండ్ సీలింగ్ పేరుతో నివాస ప్రాంతాలను 22A జాబితాలో చేర్చడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. ప్రజల ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి, వాటి పరిష్కారం పేరుతో కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.22A పేరుతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని బినామీల ద్వారా సెటిల్మెంట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలు తమ ఆస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు.ప్రభుత్వం వెంటనే సమస్యను పరిశీలించి, చట్టబద్ధమైన ఇళ్లను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
22A భూముల వివాదంపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు



















