విద్యార్థులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు నాదొకటే విన్నపం.. సోషల్ మీడియా మాయాజాలంలో పడి మోసపోకండి.సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తుల పరిచయాలను నమ్మి.. స్నేహం పేరుతో చివరకు వేధింపుల బారిన పడుతున్న ఎన్నో కేసులను నిత్యం చూస్తున్నాం. చిన్న వయసులోనే ఇలాంటి ట్రాప్‌లలో పడితే మీతో పాటు మీ తల్లిదండ్రులు, గురువులు ఎంతో మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది.సాంకేతికతను మీ చదువు, భవిష్యత్తు కోసమే ఉపయోగించుకోండి.. సోషల్ మీడియాకు బానిసలు కావొద్దు. మంచి-చెడులను గుర్తించే పరిపక్వత వచ్చేంతవరకు ఈ ఆన్లైన్ వ్యామోహాలకు దూరంగా ఉండండి.
విద్యార్థులారా జాగ్రత్త.. ముఖ్యంగా ఆడపిల్లలు సోషల్ మీడియా మాయలో పడొద్దు!


















