ఏపీ లిక్కర్ రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయన నివాసంలో కారుమూరిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. అనంతరం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు.ఏపీలో మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, నిధుల మళ్లింపు, ముడుపుల వ్యవహారంపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో కారుమూరి, ఆయన కుమారుడు సునీల్ కుమార్‌కు ముడుపులు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది.ఇదే కేసులో కారుమూరి కుమారుడు సునీల్ కుమార్‌ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్‌తో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్


















