నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. అయితే పార్టీ క్రమశిక్షణ, హద్దులు ఉల్లంఘిస్తే ఎంత పెద్ద నాయకుడినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.నేతలకు ఏవైనా ఇబ్బందులు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని సూచించారు. అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని నాయకులకు సూచించారు.
కాంగ్రెస్‌లో హద్దులు దాటితే ఉపేక్షించం: మహేష్‌కుమార్‌గౌడ్


















