ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఇన్‌ఛార్జిల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో సాధించిన విజయాలు, పాలనా విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.మోదీ పాలన, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ‘మోదీ@25’ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.రాబోయే ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సంబంధాలపై కూడా సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్‌ఛార్జిల కీలక సమావేశం


















