హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వ్యవహారం వివాదంగా మారింది. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురికి గాయాలు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.అదే సమయంలో కార్యక్రమ నిర్వహణలో బాధ్యత వహించిన ‘టాక్సిక్’ చిత్ర యూనిట్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. భారీగా అభిమానులు, విద్యార్థులు హాజరైన సమయంలో భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణలో లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, కార్యక్రమానికి అనుమతులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల బాధ్యత వంటి అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు బాధ్యులెవరు అనే విషయాన్ని దర్యాప్తు అనంతరం తేల్చనున్నట్లు తెలుస్తోంది.
టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై కేసు.. మల్లారెడ్డి కాలేజీ, చిత్ర యూనిట్‌పై ఎఫ్ఐఆర్


















