ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టును మంజూరు చేసింది. తూర్పు భారత ప్రాంతాలను అమరావతితో అనుసంధానించే లక్ష్యంతో 1,107 కిలోమీటర్ల మేర ఖరగ్‌పూర్–అమరావతి 4-లేన్ హైస్పీడ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 457 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.32,000 కోట్ల భారీ పెట్టుబడి అవసరం కానుంది. ఈ రహదారి కురుపాం, నూజివీడు మీదుగా సాగుతూ ఆగిరిపల్లి సమీపంలోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం కానుంది.ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి తూర్పు భారతంతో రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది. సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి, దాని పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ కారిడార్ కీలకంగా మారనుంది.భారీ రహదారి ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో కనెక్టివిటీ మెరుగుపడి, భవిష్యత్‌లో పట్టణీకరణ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడానికి మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు రూ.32 వేల కోట్ల భారీ ప్రాజెక్టు


















