పంజాబ్, చండీగఢ్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చండీగఢ్ సెక్టార్-43 బస్‌స్టాండ్ సమీపంలో లవ్ ప్రీత్ సింగ్ (19), జషన్ ప్రీత్ సింగ్ అలియాస్ జషన్ దీప్ (21), ప్రభ్ ప్రీత్ సింగ్ అలియాస్ ప్రభ్ (19)ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు తరన్‌తారన్‌కు, మరొకరు అమృత్‌సర్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.పాక్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది సత్నామ్ సట్టాతో ముగ్గురికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పంజాబ్, చండీగఢ్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం


















