*సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి కి బంగారు రాఖీ కట్టిన తర్వాత మంత్రి కొండ సురేఖ కామెంట్స్:*సీఎం రేవంత్ కు మూడోసారి రాఖీ కట్టాను*సీఎంకు ప్రత్యేకంగా బంగారంతో తయారు చేయించిన బంగారు రాఖీ కట్టాను* నేను అందరి ఆడపడుచును నన్ను వేరు చేసి చూడకండి ఆడపడుచులపై సీఎం రేవంత్ ఆశీర్వాదం ఉంటుంది మంత్రి సీతక్క తో కలిసి ప్రతి ఏడాదిలాగే సీఎం రేవంత్ కు రాఖీ కట్టానుసీఎంతో పాటు ఆయన అల్లుడు ,మనవడికి కూడా రాఖీ కట్టానుపండుగ వాతావరణం లో ఎలాంటి వ్యాఖ్యలు చేయనుసీఎం రేవంత్ రెడ్డికి మహిళల అండ ఎప్పుడు ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి ఇవ్వాలని దేవున్నీ కోరుకున్నసీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖహైదరాబాద్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికు మంత్రి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టారు. మంత్రి సీతక్కతో కలిసి ప్రతి ఏడాదిలాగే సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. “సీఎం రేవంత్‌కు మూడోసారి రాఖీ కట్టాను. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేయించిన రాఖీని కట్టాను” అని చెప్పారు. తాను అందరి ఆడపడుచునని, తనను వేరు చేసి చూడొద్దని కోరారు.ఆడపడుచులపై సీఎం రేవంత్ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు. సీఎంతో పాటు ఆయన అల్లుడు, మనవడికి కూడా రాఖీ కట్టినట్లు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.“సీఎం రేవంత్ రెడ్డికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తిని సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని దేవుడిని కోరుకున్నాను” అని కొండా సురేఖ పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ.


















