ASR Telugu , హైదరాబాద్: సెప్టెంబర్ 18న విడుదల కానున్న ‘కాగితం పడవలు’ సినిమా ట్రైలర్‌లో హిందువులను ఉగ్రవాదులతో పోల్చేలా డైలాగులు ఉన్నాయని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ డైలాగులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.సినిమా యూనిట్‌కు హిందువులపై ఇలాంటి వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన వారు.. “హిందువులు అంటే ఉగ్రవాదులా?” అని నిలదీశారు. దేశ సంస్కృతి, ధర్మం, మానవత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన హిందూ సమాజాన్ని ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని అన్నారు.“గడప లోపలే మా కులం.. గడప దాటితే మేమందరం హిందువులం” అంటూ హిందూ సంఘాల ప్రతినిధులు ఐక్యతను చాటారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నట్లు ఆరోపిస్తున్న డైలాగులను వెంటనే తొలగించాలని, సినిమా దర్శకుడు, హీరో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.అయితే, డైలాగులు తొలగించకపోతే, క్షమాపణలు చెప్పకపోతే సినిమాను అడ్డుకుంటామని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపడతామని సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. సినిమా విడుదలైన సందర్భంలో థియేటర్ల వద్ద నిరసనలు చేపడతామని తెలిపారు.కాగా, దర్శకుడు, హీరో ఇళ్లను ముట్టడిస్తామని, వారిపై దాడి చేస్తామంటూ కొందరు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. నిరసనలకు ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాలను మాత్రమే అనుసరించాలని, వ్యక్తులపై దాడులు లేదా బెదిరింపులకు పాల్పడకుండా చట్టపరమైన మార్గాల్లో అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.
‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్



















