BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ -లండన్‌ నుంచే హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

లండన్ : తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో క్లియరెన్స్‌ ఇవ్వలేమని విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.
అమెరికా పర్యటనలో బోస్టన్, న్యూయార్క్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి హార్వర్డ్‌, MIT, నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లకుండా ఆగస్టు 23న లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
అమెరికా పర్యటనను అధికారులు కొనసాగించాలని, ఆయా విద్యాసంస్థలతో MoUs, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
విద్య, నైపుణ్యాలు, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
లండన్‌లో సీఎం తన షెడ్యూల్‌ ప్రకారం ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌, లండన్ బిజినెస్ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌ తదితర విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అలాగే బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతోనూ చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలకు ప్రయత్నించనున్నారు.
“తెలంగాణRising ఆగదు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రగతి రాజకీయాల కంటే ఎంతో ముఖ్యమైనవి” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News