BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం.. ఇంట్లో సంబరాలు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

సినీ కుటుంబాల నుంచి వారసులు హీరోలుగా పరిచయం కావడం సాధారణమే. అయితే కుమార్తెలు నటనలోకి రాకుండా సినిమాకు సంబంధించిన ఇతర విభాగాల్లో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడం ఇప్పుడు కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కుమార్తె మోక్షద కూడా ఇదే దారిలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.రవితేజ కుమారుడు మహాధన్ ఇప్పటికే ‘రాజా ది గ్రేట్’తో బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మోక్షద మాత్రం తెరపై కనిపించకుండా సినిమా నిర్మాణంలో తనదైన పాత్ర పోషిస్తోంది.రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’కి మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్లు సమాచారం. కథ ఎంపిక నుంచి సినిమా మేకింగ్ వరకు ఆమె తన తండ్రికి సహకరించినట్లు తెలుస్తోంది. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే మోక్షద.. సినిమా విడుదల సందర్భంగా తన సోదరుడు మహాధన్‌తో కలిసి థియేటర్‌లో కనిపించింది.‘ఇరుముడి’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో రవితేజ కుటుంబంలో ఆనందం నెలకొంది. మోక్షదకు ఇదే తొలి కీలక సినిమా అనుభవంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె నిర్మాతగా మారి మరిన్ని చిత్రాల్లో భాగస్వామి అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News