కృష్ణా జలాల వినియోగంపై జరిగిన చర్చలో ప్రధానంగా తాగునీటి అవసరాలపైనే చర్చ జరిగిందని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. ఏడాది మొత్తం నీటి వినియోగంపై తెలంగాణ ప్రతిపాదన తీసుకొచ్చిందన్నారు.అక్టోబర్ వరకు ఏపీకి నీటి కేటాయింపులు చేయాలని కోరామని, మొత్తం 47 టీఎంసీల నీటిని అడిగామని చెప్పారు. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపిందన్నారు. చర్చల అనంతరం పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ అంగీకరించిందని నరసింహమూర్తి వెల్లడించారు.
తాగునీటిపైనే ప్రధానంగా చర్చ: ఏపీ ఈఎన్సీ


















