మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో రవితేజ కెరీర్‌లో వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాలను ప్రధానంగా చూపించినట్లు సమాచారం. రవితేజతో పాటు చిన్నారి నక్షత్ర నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి.వీకెండ్ తర్వాత సాధారణంగా వసూళ్లు తగ్గుతాయని భావించినప్పటికీ.. ‘ఇరుముడి’ మాత్రం నాలుగో రోజు కూడా బలమైన బుకింగ్స్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. నార్త్ అమెరికాలోనూ ఈ చిత్రం మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ‘ఇరుముడి’ నిలుస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
100 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డు



















