కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద సముద్ర అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.గల్లంతైన యువకుల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు, మెరైన్ పోలీసులు, కోస్టు గార్డ్తో పాటు స్థానిక మత్స్యకారుల సహకారం తీసుకోవాలని సూచించారు.యువకుల కుటుంబాలకు అధికారులు అందుబాటులో ఉండాలని, గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీకి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
కాకినాడ బీచ్లో గల్లంతైన యువకుల కోసం గాలింపు ముమ్మరం


















