# నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ ఆందోళనగంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గంగాధర మండల కేంద్రంలోని మధుర నగర్‌కు చేరుకుని ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించారు.గ్రామస్తుల ఆందోళనకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. గ్రామస్తులతో కలిసి వారు నిరసనలో పాల్గొన్నారు.అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలనే తమ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.
నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ ఆందోళన



















