నిజామాబాద్: సెప్టెంబర్లో రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. భర్తీ చేయనున్న పదవుల్లో 70 నుంచి 80 శాతం వరకు పార్టీ కోసం గతంలోనుంచి పనిచేస్తున్న పాత కార్యకర్తలకే అవకాశం కల్పిస్తామని చెప్పారు.గతంలో నామినేటెడ్ పదవుల భర్తీలో కొన్ని తప్పిదాలు జరిగాయని, వాటిని పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యమన్నారు.అదే సమయంలో బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ.. “దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ నైజం” అని మహేష్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పార్టీ కార్యకర్తల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.
నామినేటెడ్ పదవుల్లో పాత కార్యకర్తలకు ప్రాధాన్యం.


















