స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశభక్తికి ప్రతీకగా నిలిచిన వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో జాతీయ భావోద్వేగాలకు ప్రతీకలైన అంశాలను కాంగ్రెస్ పదేపదే విస్మరించిందనే ఆరోపణలు ఉన్నాయి.1937లో వందేమాతరం గీతంలోని కొన్ని భాగాలను తొలగించేందుకు తీసుకున్న నిర్ణయం నుంచి, జాతీయ చిహ్నాల విషయంలో పార్టీ అనుసరించిన విధానాల వరకు అనేక అంశాలను విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. దేశ స్వాభిమానం, జాతీయ గౌరవం కంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపిన వందేమాతరం వంటి గీతాల పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని, జాతీయ భావాలను రాజకీయ లెక్కలతో ముడిపెట్టకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అణువణువున అహంకారం.. అడుగడుగునా అవమానం


















