తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూ లైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.నిన్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని 66,437 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.4.45 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ



















