E20 పెట్రోల్‌పై బీపీసీఎల్ కీలక ప్రకటనE20తో పాటు E10 అందుబాటులోకి తెస్తాంపాత వాహనాల్లో E10 వాడేలా చర్యలు-BPCLE20 పెట్రోల్‌పై బీపీసీఎల్ కీలక ప్రకటనE20 పెట్రోల్ వినియోగంపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో బీపీసీఎల్ కీలక స్పష్టత ఇచ్చింది. పాత వాహనాలకు తక్కువ ఎథనాల్ కలిగిన ఇంధనం అందుబాటులోకి తీసుకురావచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. E20తో పాటు E10 పెట్రోల్‌ను అందించే అవకాశంపై చర్చ జరుగుతోందని బీపీసీఎల్ సీఎండీ సంజయ్ ఖన్నా తెలిపారు. అయితే E20 స్థానంలో E10ను తీసుకురావాలనే నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదని బీపీసీఎల్ స్పష్టం చేసింది. ముఖ్యంగా పాత వాహనాలు E20కు అనుకూలంగా లేని సందర్భాల్లో వాటి యజమానులకు తక్కువ ఎథనాల్ కలిగిన ఇంధనం అందుబాటులో ఉంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. E10లో 10 శాతం ఎథనాల్, E20లో 20 శాతం ఎథనాల్ ఉంటుంది. E10ను అదనపు ఇంధన గ్రేడ్‌గా తీసుకొస్తే దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద ప్రత్యేక నిల్వ, సరఫరా వ్యవస్థ అవసరమయ్యే అవకాశం ఉంది. అందువల్ల దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుంది.
E20 పెట్రోల్‌పై బీపీసీఎల్ కీలక ప్రకటన



















