ఏపీ లిక్కర్ రవాణా వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం రవాణాలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఆర్థిక అవకతవకలతో ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. కారుమూరి కుటుంబానికి చెందిన సుమారు రూ.37.7 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినట్లు సమాచారం. కారుమూరి కుమారుడు సునీల్‌ను ఈ కేసులో గతంలోనే అరెస్ట్ చేశారు. కారుమూరిని నేడు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఏపీ లిక్కర్ రవాణా కేసులో కారుమూరి అరెస్ట్



















