నగరాలే కాదు.. ప్రతి పల్లె అభివృద్ధే మోదీ లక్ష్యంమోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి సరికొత్త ఊపిరి పోస్తోంది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వందలాది కోట్ల రూపాయలతో చేపడుతున్న రహదారులు, వారధుల నిర్మాణ పనులు ప్రాంతీయ రూపురేఖలను మార్చబోతున్నాయి.గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు, వేగవంతమైన రవాణా, వాణిజ్య విస్తరణకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. నగరాలకే పరిమితం కాకుండా ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమనే విషయాన్ని ఈ పనులు స్పష్టం చేస్తున్నాయి.
నగరాలే కాదు.. ప్రతి పల్లె అభివృద్ధే మోదీ లక్ష్యం



















