‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.✴️ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో, ప్రతి క్రీడాకారుడు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ✴️ క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.✴️ అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలను కల్పిస్తున్నామని గుర్తుచేస్తూ, తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలుజాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతిని పురస్కరించుకుని, ఆయన స్ఫూర్తితో ప్రతి క్రీడాకారుడు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాలను సాధించాలని సీఎం ఆకాంక్షించారు.తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.క్రీడాకారులకు అత్యుత్తమ మౌలిక వసతులు, ఆధునిక శిక్షణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ క్రీడా వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రోత్సహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.



















