శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన ఘర్షణపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘించినట్లు నిర్ధారించింది.ఈ ఘటనకు సంబంధించి జైస్వాల్, ఫెర్నాండో ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, అలాగే ఒక్కొక్కరికి ఒక్క డీమెరిట్ పాయింట్ విధించారు. ఇద్దరూ తమ తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే చర్యలు పూర్తయ్యాయి.జైస్వాల్‌ను ఫెర్నాండో ఔట్ చేసిన అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి శారీరక ఘర్షణకు దగ్గరగా వెళ్లడంతో ఈ వ్యవహారం ఐసీసీ దృష్టికి వెళ్లింది.
యశస్వి జైస్వాల్‌కు భారీ జరిమానా.. అసిత ఫెర్నాండోకూ శిక్ష



















