ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా 6,500కు పైగా రైల్వే స్టేషన్లు, 10,000కు పైగా లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవస్థ రైళ్ల రాకపోకలను మరింత సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు, సిగ్నలింగ్‌లో మానవ తప్పిదాలకు అవకాశం తగ్గిస్తుంది. ఫలితంగా రైలు ప్రమాదాల ముప్పును గణనీయంగా తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని ప్రధాని వెల్లడించారు.రైల్వే నెట్‌వర్క్‌లో సాంకేతికతను మరింత విస్తరించడం ద్వారా ప్రయాణికులకు సురక్షితమైన, ఆధునిక రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి.
రైల్వే భద్రతకు మరింత పటిష్ఠ చర్యలు



















