BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

అంబేద్కర్ హౌస్ సందర్శన.. సామాజిక న్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

అంబేద్కర్ హౌస్ సందర్శన.. సామాజిక న్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు**లండన్:** ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి లండన్‌లోని చారిత్రక **అంబేద్కర్ హౌస్‌**ను సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921–22లో విద్యాభ్యాస సమయంలో నివసించిన ఈ ప్రదేశాన్ని సీఎం పరిశీలించారు.అంబేద్కర్ నివసించిన ఇంటిని ప్రస్తుతం ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పరిచయం చేసే మ్యూజియంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం, కుల వివక్ష నిర్మూలన వంటి అంశాలకు ఈ మ్యూజియంలో ప్రాధాన్యం కల్పించారు.సుమారు గంటపాటు సాగిన పర్యటనలో అంబేద్కర్ హౌస్‌ మ్యూజియం ఏర్పాటులో కీలకంగా పనిచేసిన యాంటీ-కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ (ACDA) చైర్ సంతోష్ దాస్ MBE.. బాబాసాహెబ్ లండన్‌లో గడిపిన కాలం, ఆయన జీవితానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.ఈ సందర్భంగా సందర్శకుల డైరీలో రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను నమోదు చేశారు. అంబేద్కర్ హౌస్‌ను సందర్శించడం ఒక పవిత్ర యాత్రను తలపించిందని, ఈ పర్యటన జీవితాంతం స్ఫూర్తినిచ్చే అనుభూతిగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం మరింత అంకితభావంతో పనిచేయాలనే సంకల్పం ఈ సందర్శనతో బలపడిందని తెలిపారు.పర్యటన అనంతరం సీఎం మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన వ్యక్తిగత జ్ఞాపకాలు, వస్తువులను దగ్గరగా చూడటం తన జీవితంలోని గొప్ప అనుభవాల్లో ఒకటిగా అభివర్ణించారు. సమాజంలో సమానత్వం, న్యాయం, వివక్ష రహిత విలువలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఈ చారిత్రక ప్రదేశం మరోసారి గుర్తుచేసిందని పేర్కొన్నారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News